కిరాణ దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2020-12-11T05:09:42+05:30 IST

కిరాణ దుకాణంలో చోరీ

కిరాణ దుకాణంలో చోరీ

చౌదరిగూడ: మండలంలోని లాల్‌పహాడ్‌ చౌరస్తాకు సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో బుధవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏఎస్సై బాలస్వామి, దుకాణ యాజమాని తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రానగర్‌ గ్రామానికి చెందిన రవి నాలుగేళ్ల నుంచి లాల్‌పహాడ్‌ చౌరస్తాలోని గున్నాల శేఖర్‌ ఇంటి ఆవరణలో కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 9గంటలకు తాళం వేసి రూమ్‌కు వెళ్లాడు. ఉదయం వచ్చి చూసేసరికి తాళం విరగ్గొట్టి ఉండడంతో  పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏఎస్సై తన సిబ్బందితో అక్కడికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. రూ.50వేలతో పాటు 45వేల విలువగల సామాను చోరీకి గురైనట్టు రవి తెలిపారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-11T05:09:42+05:30 IST