-
-
Home » Telangana » Rangareddy » The survey should be completed in a timely manner
-
సర్వేను సకాలంలో పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2020-10-07T06:42:22+05:30 IST
వ్యవసాయేతర ఆస్తుల గణన సర్వేను సకాలంలో పూర్తిచేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో జానకిరెడ్డి కోరారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి,

జడ్పీ డీప్యూటీ సీఈఓ జానకిరెడ్డి
ఆమనగల్లు మండలంలో సర్వే పనుల పరిశీలన
మాడ్గులలో అదనపు కలెక్టర్, కడ్తాల్‌లో ఆర్డీవో పర్యటన
ఆమనగల్లు : వ్యవసాయేతర ఆస్తుల గణన సర్వేను సకాలంలో పూర్తిచేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో జానకిరెడ్డి కోరారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి, మంగళపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఎంపీడీవో వెంకట్రాములు, సర్పంచులు మంజులాయాదయ్య, నర్సింహారెడ్డితో కలిసి సర్వే తీరును పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నెంబర్లు లేని ప్రతి ఇంటి గణన పకడ్బందీగా చేపట్టి ఆన్‌లైన్‌లో పొందపరుచాలన్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శివకుమార్, గణేశ్‌పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్ మండలంలోని మైసిగండి, కర్కల్‌పహాడ్ గ్రామాల్లో ఎంపీడీవో చల్లా అనురాధతో కలిసి డిప్యూటీ సీఈఓ జానకిరెడ్డి ఇంటింటి సర్వేను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తులసీరామ్ నాయక్, నాగమణి వెంకోబా, కార్యదర్శులు ఉన్నారు.
సర్వే వేగవంతం చేయాలి
మాడ్గుల : మండలపరిధిలోని కొల్కుపల్లి గ్రామంలో మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటించారు. ఎంపీడీఓ పారుక్‌హుస్సేన్‌తో కలిసి వ్యవసాయేతర ఆస్తుల సర్వే తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సర్వేను త్వరగాపూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహాసీల్దార్ పురుషోత్తం, కో-ఆప్షన్ సభ్యుడు సోమయ్య, వార్డు సభ్యుడు యాదయ్య ఉన్నారు.
ప్రజలు సహకరించాలి : ఆర్డీవో
కడ్తాల్ : వ్యవసాయేతర ఆస్తుల గణన నమోదు కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కందుకూరు ఆర్డీవో రవీందర్‌రెడ్డి కోరారు. నిర్ణీత గడువులోగా సర్వే పూర్తయ్యేలా పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. కడ్తాల్ మండల కేంద్రంలో మంగళవారం సర్వేను రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ప్రతి ఇంటి పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో చల్లా అనురాధ, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పంచాయతీకార్యదర్శి హరీశ్‌రెడ్డి, నాయకులు లాయక్‌అలీ, పద్మభూషణం ఉన్నారు.
ఆస్తుల నమోదుకు సహకరించాలి
మంచాల : ఆస్తుల సమగ్ర వివరాల నమోదుకు ప్రజలంతా సహకరించాలని మంచాల ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అధికార యంత్రాంగం ఇంటింటికీ తిరుగుతూ ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. జాపాలలో కొనసాగుతున్న ఆస్తులగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిఇంటి యజమాని తమ జాబ్‌కార్డు, కరెంటుబిల్లు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలను అందుబాటులో ఉంచుకుని అధికారులకు సహకరించాలని కోరారు. ఇంటికొలతలపై సందేహాలుంటే పంచాయతీ సిబ్బంది ద్వారా ఇళ్లు కొలతలు వేయించుకుని సరిచూసుకోవాలన్నారు. ఆతర్వాత ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నౌహీద్‌బేగం, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్, ఆరుట్లలో సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ జంగయ్యగౌడ్, జనార్ధన్‌రెడ్డి, బుచ్చయ్య, సురేష్, శంకర్య, శ్రీకాంత్, నరేందర్ పాల్గొన్నారు.