పోలీసు అమరుల త్యాగాలు వృథాకావు

ABN , First Publish Date - 2020-10-31T06:23:43+05:30 IST

ప్రజారక్షణలో ప్రాణాలొడ్డిన పోలీసు అమరవీరుల త్యాగాలు వృథాకావని శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి అన్నారుఉ. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రజలంతా అండగా నిలిచి వారికి మనోధైర్యం కల్పించాలని

పోలీసు అమరుల త్యాగాలు వృథాకావు

శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి 


కడ్తాల్‌ : ప్రజారక్షణలో ప్రాణాలొడ్డిన పోలీసు అమరవీరుల త్యాగాలు వృథాకావని శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి అన్నారుఉ. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రజలంతా అండగా నిలిచి వారికి మనోధైర్యం కల్పించాలని ఆయన కోరారు. కడ్తాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం కడ్తాల్‌, ఆమనగల్లు, తలకొండపల్లి పోలీసుస్టేషన్ల ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కడ్తాల ఎస్‌ఐ సుందరయ్య, జడ్పీటీసీలు జర్పుల దశరథ్‌నాయక్‌, ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌, లయన్స్‌క్లబ్‌ మాజీ గవర్నర్‌ చెన్నకిషన్‌రెడ్డి, ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్లడ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ అంజిరెడ్డిలతో కలిసి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 167 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సందర్శించారు. రక్తదానం చేసిన యువకులను, స్థానికులను డీసీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి వారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు. ప్రమాదాల బారిన పడిన వారికి, తలసేమియా బాధితుల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, నాయకులు లచ్చిరామ్‌ నాయక్‌, సులోచన సాయిలు, రమేశ్‌, నేనావత్‌ బీక్యానాయక్‌, జంగం సుగుణసాయిలు, ఆసీఫ్‌అలీ, భాస్కర్‌రెడ్డి, చేగూరి వెంకటేశ్‌, కసిరెడ్డి రాంరెడ్డి, జూలూరు రమేశ్‌, దోనాదుల మహేశ్‌, పిప్పళ్ల వెంకటేశ్‌, చందజోజీ, మహేశ్‌, మంకి శ్రీను, రాఘవాచారి, రవీందర్‌రెడ్డి, యాదయ్యగౌడ్‌, కడారి రామకృష్ణ, భగీరథ్‌, పోనుగోటి అర్జున్‌రావు, నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, అంజిరెడ్డి, భిక్షపతి, రాఘవరెడ్డి, మంగళపల్లి నర్సింహ, అశోక్‌, జంగం వెంకటేశ్‌, ఉప్పల అశోక్‌, బుచ్చిబాబు, జగన్‌, బీక్యానాయక్‌, ప్రియరమేశ్‌, బండి మంజులచంద్రమౌళి, రవీందర్‌, నింగ్యారి యాదగిరి, యాదయ్య, సీతారాంరెడ్డి, నర్సింహశెట్టి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read more