-
-
Home » Telangana » Rangareddy » The right to vote must be exercised
-
ఓటు హక్కును సద్వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2020-10-07T06:48:34+05:30 IST
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం వ్యవస్థాపకులు సామల వేణు అన్నారు.

కీసర/ఘట్‌కేసర్: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం వ్యవస్థాపకులు సామల వేణు అన్నారు. పట్టభధ్రుల ఓటుహక్కు నమోదుపై మంగళవారం మండల కేంద్రం కీసరలోని కేఆర్‌కే కళాశాలలో పట్టభధ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామల వేణు మాట్లాడుతూ 2017 అక్టోబర్ 31లోపు బ్యాచిలర్, డిప్లామా డీగ్రీ పట్టా పొందిన ప్రతిఒక్కరూ ఓటుహక్కును నమోదు చేసుకోవాలన్నారు. అక్టోబర్1న మొదలైన నమోదు కార్యక్రమం నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలోని 5వ వార్డులోని సాయినగర్ కాలనీలో ఘట్‌కేసర్ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివా్‌సగౌడ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ఇంటింటికీ తిరిగి పట్టభధ్రుల నుంచి ఓటరునమోదు పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో వెంకటేష్, హరిశంకర్, మల్లిఖార్జున్, రాజు పాల్గొన్నారు.