గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-03-15T05:59:54+05:30 IST

రైతులకు గిట్టుబాటు కల్పించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయం

పరిగి: రైతులకు గిట్టుబాటు కల్పించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి మార్కెట్‌కు వచ్చే రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేయడమే లక్ష్యంగా పాలకవర్గం పని చేయాలని సూచించారు. రైతులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో మార్కెట్‌యార్డులో రైతులకు భోజనవసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు లేదా మార్కెట్‌ కమిటీల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. చైర్మన్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T05:59:54+05:30 IST