రైతుల సంక్షేమానికే ప్రభుత్వ ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-04-26T09:33:53+05:30 IST
రైతుల సంక్షేమానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు.

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఆమనగల్లు/ మాడ్గుల: రైతుల సంక్షేమానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మాడ్గుల మండల కేంద్రంలోని ఆర్కపల్లిలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం డీసీవో జనార్దన్‌రెడ్డి, సింగిల్ విండో చైర్యన్ సూదిని తిరుమల్‌రెడ్డి, సర్పంచ్‌లు జంగయ్యగౌడ్, ఏర్పుల జంగయ్యతో కలిసి జైపాల్‌యాదవ్ ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకటేష్, సీఈవో ముత్యపురెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు శంకర్‌నాయక్, జైపాల్‌రెడ్డి, సూదిని కొండల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, జ్యోతి, లాలయ్యగౌడ్, రాజవర్దన్‌రెడ్డి, జంగయ్యగౌడ్, యాదిరెడ్డి, జైపాల్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.