ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2020-09-01T08:34:46+05:30 IST

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత

కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌ అర్బన్‌ : ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. స్టాండ్‌ అప్‌ ఇండియా పథకం కింద రూ. కోటితో మంజూరైన మూడు లారీలను సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు రుణాలు ఇవ్వడంతోపాటు పనిని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందులోభాగంగా గంగవరం పోర్టుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ లారీల ద్వారా అన్నిరకాల సరుకులను దిగుమతి, ఎగుమతి చేయడం జరుగుతుందన్నారు. దీంతో రాష్ట్రంలో సుమారు 500మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. అనంతరం తిమ్మాయిపల్లికి చెందిని సంపంగి వెంకటమ్మకు రూ.32వేల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేశారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, ఎంపీపీ ఇందిర, నేషనల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఏవో వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్‌ మాధురి తదితరులు పాల్గొన్నారు. 


ఎవర్‌గ్రీన్‌గా తీర్చిదిద్దుతాం..

శామీర్‌పేట : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని మున్సిపాల్టీలను, కార్పొరేషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని ఎవర్‌గ్రీన్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని పోతాయిపల్లి కనకదుర్గమ్మ ఆలయం వద్ద రూ.1.5 కో ట్లతో నూతనంగా కొనుగోలు చేసిన రెండు వాటర్‌ ట్యాం కులు, రెండు ట్రాక్టర్లు, 13ఆటోలు, డోజర్‌ను ఆయన ప్రారంభించారు.

కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ పన్నాల వాణివీరారెడ్డి, కమిషనర్‌ సురేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-01T08:34:46+05:30 IST