అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
జల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
పల్లెలు, పట్టణాల్లో జండా ఎగురవేసిన పార్టీ శ్రేణులు
ఆమనగల్లు/కడ్తాల: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. టీఆర్‌ఎ్‌స్ ఆవిర్భావ వేడుకలను ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండ లాల్లో సోమవారం ఆ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు.