-
-
Home » Telangana » Rangareddy » The distance from the pilgrims to the temple worship
-
ఆలయ పూజలకు భక్తులు దూరం
ABN , First Publish Date - 2020-03-25T12:00:49+05:30 IST
కరోనా వ్యాధి దెబ్బకు భక్తులు ఆలయ పూజలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాలు మూతపడ్డాయి...

షాద్‌నగర్ అర్బన్ : కరోనా వ్యాధి దెబ్బకు భక్తులు ఆలయ పూజలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాలు మూతపడ్డాయి. అలాగే ఇతర దేవాలయాలకు సైతం భక్తులు దూ రంగా ఉంటున్నారు. దీంతో నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలను సైతం ఆలయ పూజారులే నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఈశ్వర్‌కాలనీలో నూతనంగా నిర్మించిన ఈశ్వర అభయాంజనేయస్వామి ఆలయంలో విగ్రహా ప్రతిష్ఠాపన జరిగి 41 రోజులవుతున్నది. ఈ సందర్భంగా మండల పూజలను మంగళవారం నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ పూజలతో పాటు హోమం, శ్రీ కాశీవిశాలాక్షీ, విశ్వనాథస్వామి కల్యాణం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు రావద్దని, పూజారులే కార్యక్రమాలను నిర్వహించారు. కాగా ఆలయానికి వెళ్లి దేవుడిని చూడకుండా చేసిన కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.