-
-
Home » Telangana » Rangareddy » The Chinese participated in the incident
-
పాల్గొన్న చినజియర్ స్వామి స్వీయ నిర్బంధంలోనే ఉగాది
ABN , First Publish Date - 2020-03-25T12:04:48+05:30 IST
ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు...

ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి సబితారెడ్డి
ఎవరూ ఆందోళన చెందవద్దు
ఒకటి, రెండు రోజుల్లో రేషన్ సరఫరా
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోనే ఉగాది పండుగను అందరూ ఇంట్లో చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను రూపు మాపేందుకు అందరూ సహకరించాలని, ప్రభుత్వ సూచనలన్నీ పాటించాలని కోరారు. శ్రీశార్వరి నామసంవత్సరం ప్రజలందరికీ మేలు జరగాలని, వారి జీవితాల్లో వెలుగులు రావాలని,. అందరూశుభప్రదంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరూ ఇంటి వద్దనే ఉంటూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పండుగ చేసుకోవాలని సూచించారు. కరోనావ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. సరుకుల కోసం ఎవరూ ఆందోళన చెందరాదని, ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులందరికీ రేషన్ అందిస్తుందని, ఒక్కోకుటుంబ సభ్యుడికి 12 కిలోల చొప్పన బియ్యం అందించడమే కాక రూ.1500లు అందిస్తామని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సబితారెడ్డి తెలిపారు. సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వం చేసిన సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. స్వీయ నిర్బంధంతో లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని కోరారు.