కార్మికులకు చేయూత

ABN , First Publish Date - 2020-03-27T11:47:45+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో

కార్మికులకు చేయూత

కరోనా నేపథ్యంలో కేంద్రం ఆర్థిక ప్యాకేజీ 

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో కార్మికులు, కర్షకులు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరిజిల్లాలో దాదాపు 7వేలకుపైగా చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలున్నాయి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులు, కర్శకులను ఆదు కునేందుకుగానూ కేంద్ర ప్రభు త్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. రూ.15 వేలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ చందాను కేంద్రమే భరిస్తుంది.


ఉద్యోగి వాటా, యజమాని వాటా కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమచేస్తుంది. వంద మంది లోపు ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ వందమంది ఉద్యోగుల్లో 90శాతం మంది రూ.15వేలలోపు వేతనం కలిగి ఉం డాలి. ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 75శాతం వరకు పీఎఫ్‌ ఉపసంహరించుకోవచ్చు. నగరశివారులో వెలిసిన వెంచర్లలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వం నిధు లు కేటాయించింది. కార్మికులకు నెలకు రూ.2వేల వరకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. 

Updated Date - 2020-03-27T11:47:45+05:30 IST