మూడు వారాలు ఇంతే..

ABN , First Publish Date - 2020-03-25T10:59:56+05:30 IST

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలకు దిగాయి. మరో మూడు వారాలపాటు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు

మూడు వారాలు ఇంతే..

మరింత కఠినంగా లాక్‌డౌన్‌  

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌ 

రంగంలోకి దిగాలని ఆదేశం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలకు దిగాయి. మరో మూడు వారాలపాటు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటిం చారు. దీంతో లాక్‌డౌన్‌ 21 రోజుల పాటు ప్రజలు స్వీయ నిర్బంధంలోనే ఉండాలి. ప్రస్తుత పరిస్థితు ల్లో ప్రజలందరూ లాక్‌డౌన్‌ పాటించాలని, ప్రతి ఇల్లు, ప్రతి వీధిలాక్‌ డౌన్‌ కావాలని పిలుపుని చ్చారు. అందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. మరో వైపు సీఎం కేసీఆర్‌ కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా నిర్వహించాలని లేదంటే సైన్యాన్ని పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాక మంత్రులు, ఎమ్మెల్యేలు, నగర కార్పోరేటర్లకు వార్నింగ్‌ ఇచ్చారు. అందరూ రంగంలో దిగాలని ఆదేశాలు జారీ చేశారు. కీలక సమయంలో మీ ప్రాంతాల్లో ప్రజలకోసం పనిచేయకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు జిల్లా కేంద్రాల్లో, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఉండి లాక్‌డౌన్‌ సంపూ ర్ణంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


సీఎం ఆదేశాలతో నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కార్య రంగంలోకి దిగనున్నారు. పోలీసులు, ఇతర శాఖల అధికా రులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు నిత్యవసర సరుకుల ఇబ్బంది లేకుండా చూడను న్నారు. ఒకటి రెండు రోజుల్లో తెల్లరేషన్‌కార్డుదా రలందరికీ రేషన్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంత్రు లకు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్‌తో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మూత పడింది. నిత్యం ప్రయాణీకులతో కళకళలాడే  శంషాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం నుంచి తొలిసారిగా అన్ని సర్వీసులు నిలిచిపోయాయి.


కరోనాను  అరికట్టేందుకు కేంద్రం ముందస్తుగా తీసుకున్న చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆది వారం అర్థరాత్రి నుంచి అంతర్జాతీయ  సర్వీ సులను రద్దు చేసిన కేంద్రం మంగళవారం దేశీయ సర్వీసులను కూడా రద్దుచేసింది. దీంతో  మంగళ వారం రాత్రి 11:59 తరువాత  ఎయిర్‌పోర్టు నుంచి అన్ని రాకపోకలు బంద్‌ అయ్యాయి.  శంషాబాద్‌ అంత ర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైన తరువాత ఇలా ప్రయాణీకులకు సం బంధించిన అన్ని సేవలు నిలిచిపోవడం ఇదే కావడం గమనార్హం.  దీంతో మం గళవారం అర్థరాత్రి తరువాత ఎయిర్‌ పోర్టు కళాహీనంగా మారింది. ఎయిర్‌ పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు మూసివేశారు. 

Updated Date - 2020-03-25T10:59:56+05:30 IST