తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-25T05:43:28+05:30 IST

తండ్రిని హత్య చేసిన ఘటనలో కుమారుడిని అరెస్టు చేసినట్లు తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడి ్డవెల్లడించారు.

తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్టు

తాండూరు రూరల్‌ : తండ్రిని హత్య చేసిన ఘటనలో కుమారుడిని అరెస్టు చేసినట్లు తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడి ్డవెల్లడించారు.మంగళవారం తాండూరు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆయ న విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. యాలాల మండలం సంగెంఖుర్దు గ్రామానికి చెందిన శేఖర్‌ తనతండ్రి రుస్తుంను భూమి తనపేరున చేయలేదని, రైతుబంధు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోనే  పొలం వద్ద  రాయితో తండ్రితలపై మోది హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినందున శేఖర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. తాండూరు  ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడం జరిగిందన్నారు. 

Read more