తాత్కాలికంగా రెండు రైతుబజార్లు ఏర్పాటు
ABN , First Publish Date - 2020-03-27T12:09:24+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణీత సమయం ఉదయం 6 నుండి 9 గంటల సమయం గడువు విధిం చింది. దీంతో ప్రజలందరూ ఒకే సమయంలో
సామాజిక దూరం పాటించేందుకు ఎమ్మెల్యే చర్యలు
కొనుగోళ్లకు అదనంగా మరో గంట సమయం
వికారాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణీత సమయం ఉదయం 6 నుండి 9 గంటల సమయం గడువు విధిం చింది. దీంతో ప్రజలందరూ ఒకే సమయంలో కొనుగోలు చేయడానికి రావడం వల్ల సామాజిక దూరం పాటించడం కష్టమవుతోంది. దీంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇది వరకు ఉన్న రైతుబజార్‌తో పాటు అదనంగా రెండు తాత్కాలిక రైతుబజార్‌ల ను ఏర్పాటు చేయించారు. పట్టణంలోని శిశుమందిర్ పాఠశాల మైదానంలో, సాకేత్ నగర్‌లోని గౌలీకర్ ఫంక్షన్‌హాల్ సమీపంలోని మల్లమ్మ గుడి మైదానంలో వాటిని ఏర్పాటు చేశారు. సమయాన్ని మరో గంట పాటు పొడిగించారు. ప్రజలు ఈ విష యాన్ని గమనించి వారి సమీప రైతుబజార్లకు వెళ్లాలని ఆయన సూచించారు.