తెలంగాణ-కర్ణాటక సరిహద్దు మూసివేత

ABN , First Publish Date - 2020-03-24T08:03:38+05:30 IST

తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దును ఉన్నతా ధికారుల ఆదేశా ల మేరకు రెవెన్యూ, పోలీసులు, వైద్య సిబ్బం ది కలిసి మూసివేశారు. కరన్‌కోట్‌ పోలీసు లు అక్కడే బసచేసి వాహనాలను...

తెలంగాణ-కర్ణాటక సరిహద్దు మూసివేత

  • నిలిచిపోయిన వాహనాలు
  • కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ఎవరినీ  రానివ్వద్దని కోరుతున్న గ్రామస్థులు

తాండూరు రూరల్‌: తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దును ఉన్నతా ధికారుల ఆదేశా ల మేరకు రెవెన్యూ, పోలీసులు, వైద్య సిబ్బం ది కలిసి మూసివేశారు. కరన్‌కోట్‌ పోలీసు లు అక్కడే బసచేసి వాహనాలను తెలంగా ణ రాష్ట్రంలోకి రాకుండా వెనుదిరిగి పంపుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా చెక్‌పోస్టులను మూసినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక నుంచి తెలంగాణలోకి ఏ వాహనాలూ రాకు ండా వికారాబాద్‌ ఎస్పీ నారాయణ ఆదేశాల తో చెక్‌పోస్టు వద్ద రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ అచ్యుతరావు ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. రిజర్వ్‌, సివిల్‌ పోలీసులు చెక్‌పోస్టు వద్ద వాహనాలను పర్యవేక్షిస్తున్నారు. తాం డూరు పీపీ యూనిట్‌ డాక్టర్‌ రాకేష్‌, వైద్య సిబ్బంది అక్కడే ఉంటూ కర్ణాటక నుంచి వ చ్చే వ్యక్తులను కరోనా వైర్‌సపై నియంత్రణ కు సూచనలు, సలహాలు చేస్తున్నారు. తాం డూరు మండల కర్ణాటక సమీపంలోని సంగెంకలాన్‌, ఓగిపూర్‌, కొత్లాపూర్‌ గ్రామాల్లోకి కర్ణాటక నుంచి ఎవరినీ రానీయకుండా కొందరు సంగెంకలాన్‌ గ్రామస్థులు గోతులు తవ్వి కట్టడి చేస్తున్నారు. రోడ్డుపై ముళ్ల కం పలు వేసి ఎవరినీ గ్రామంలోకి ప్రవేశించకు ండా అడ్డుకుంటున్నారు. సరిహద్దు గ్రామాల్లోకి కర్ణాటకకు చెందిన వాహనాలు రాకుం డా పోలీసుల భద్రతను ఏర్పాటు చేయాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌.. ఎస్సై సంతో్‌షకుమార్‌ను కోరారు. గ్రామ సమీపం లో రోడ్డును జేసీబీతో తవ్వి నియంత్రణకు చ ర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

Read more