తెలంగాణ-కర్ణాటక సరిహద్దులు మూసివేత

ABN , First Publish Date - 2020-03-28T06:35:12+05:30 IST

కరోనా ప్రభావంతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దులను ఆయా గ్రామాల ప్రజలు మూసివేశారు. తాండూరు మండల పరిధిలోని సంగెంకలాన్‌ శివారులో సర్పంచ్‌ మేఘనాథ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో...

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులు మూసివేత

తాండూరు రూరల్‌ : కరోనా ప్రభావంతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దులను ఆయా గ్రామాల ప్రజలు మూసివేశారు. తాండూరు మండల పరిధిలోని సంగెంకలాన్‌ శివారులో సర్పంచ్‌ మేఘనాథ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని మిర్యాణ్‌, ఘనాపూర్‌ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను జేసీబీతో తవ్వి ట్రంచ్‌ ఏర్పాటు చేయగా, గ్రామ సమీపంలోని రోడ్డుపై గోడ పెట్టేశారు. ఉద్దండాపూర్‌ శివారులోని మైసమ్మగడ్డతండా వద్ద గిరిజనులు తమ తండాలోకి కర్ణాటక ప్రాంతానికి చెందిన మిర్యాణ్‌, కిష్టాపూర్‌ గ్రామాల నుంచి ప్రజలు రాకుండా మూసి వేశారు. ఓగీపూర్‌ గ్రామ సమీపంలోని సర్పంచ్‌  పద్మ ఆధ్వర్యంలో కర్ణాటక ప్రాంతంలోని సత్తర్‌సాలా, కరిచికాళం గ్రామ శివారులో ముళ్ల కంచె ఏర్పాటు చే శారు. 

Updated Date - 2020-03-28T06:35:12+05:30 IST