తెలంగాణాను అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్
ABN , First Publish Date - 2020-12-14T04:45:59+05:30 IST
తెలంగాణాను అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
షాద్‌నగర్ రూరల్: బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఅర్ ఏడేళ్లలో తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శ్రీవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేశారని, నియంత్రిత సాగుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేశారన్నారు. ధాన్యాన్ని కొనే దిక్కులేక కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు బీమా పరిహారం వచ్చేదన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.700కోట్లు ఇస్తే పరీక్షలే చేయలేదని ఆరోపించారు. సమావేశంలో అశోక్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, వెంకటే ష్‌గుప్తా, భూపాలచారి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.