తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-26T06:12:35+05:30 IST

తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
అంకుశాపూర్‌లో మాట్లాడుతున్న బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని పలు గ్రామాల ప్రజలు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవుశాపూర్‌ బ్రాంచీ మేనేజర్‌ శ్రీనివాస్‌ కోరారు. మండలంలోని అంకుశాపూర్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమశాఖలో పొదుపు పథకాలు, రుణాలు, డిజిటల్‌ లిటరసీ సేవలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. అంకుశాపూర్‌కు చెందిన వ్యాపారులు, రైతులు ఖాతాలు తెరిచి మా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధి సతీష్‌, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 


బ్యాంక్‌ లావాదేవీలపై అవగాహన


కులకచర్ల/ధారూరు: ప్రతి ఒక్కరూ బ్యాంక్‌ లావాదేవీల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా బ్యాంక్‌ ఖాతాదారులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు పొందాలన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మైపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ అంజిలయ్య పాల్గొన్నారు. ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్‌ గ్రామంలో బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు నాగారం శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సమావేశం నిర్వహించారు. రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే ప్రయోజనం కలుగుతుందని  బ్యాంకు మేనేజర్‌ బి. కుమార్‌ అన్నారు. సమావేశంలో సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T06:12:35+05:30 IST