తాండూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు వాడీ వరకే..

ABN , First Publish Date - 2020-02-12T09:10:55+05:30 IST

తాండూరు, వికారాబాద్‌ల మీదుగా నడిచే కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను

తాండూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు వాడీ వరకే..

  • రెండు రైళ్లు రద్దు

తాండూరు : తాండూరు, వికారాబాద్‌ల మీదుగా నడిచే కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా వాడీ వరకు కొనసాగిస్తున్నారు. పలు రైళ్లు మంగళవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. దీంతో ముఖ్యంగా తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం నుంచి నడిచే రైలు కావడంతో తెలంగాణ-కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. 


రద్దయిన రైళ్లు..

రైలు నంబర్‌-57129 బిజాపూర్‌-బొల్లారం ప్యాసింజర్‌, రైలు నంబర్‌-57130 హైదరాబాద్‌-బిజాపూర్‌ వరకు వెళ్లే రైలు ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రద్దయినట్లు సమాచారం. 


పాక్షికంగా నడిచే రైళ్లు..

రైలునంబర్‌-57660 ఫలక్‌నూమా-గుల్బర్గ ప్యాసింజర్‌ ఈనెల 12వ తేదీ నుంచి 25వ వరకు వాడీ వరకే నడవనుంది. అదేవిధంగా రైలునంబర్‌-57659 సోలాపూర్‌-ఫల క్‌నూమా వాడీ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ రైళ్లు వాడీ వరకే నడపనున్నారు.


Updated Date - 2020-02-12T09:10:55+05:30 IST