భక్తిశ్రద్ధలతో సుదర్శన యాగం

ABN , First Publish Date - 2020-12-14T05:06:41+05:30 IST

భక్తిశ్రద్ధలతో సుదర్శన యాగం

భక్తిశ్రద్ధలతో సుదర్శన యాగం
పూజల్లో పాల్గొన్న బొప్పడి గోపాల్‌, ఎల్‌ఎన్‌ రెడ్డి

కడ్తాల్‌ : మండల పరిధిలోని మక్త మాదారం వేణుగోపాల స్వామి దేవాలయంలో సుదర్శన యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రావిచెడ్‌ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాగం నేపథ్యంలో ఆలయాన్ని పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చకుడు తిరుమని ఇంజమూరి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో యాగం, ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ సందర్బంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మినర్సింహారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌, ఎంపీటీసీలు బండి మంజుల చంద్రమౌళి, లచ్చీరాంనాయక్‌, నాయకులు బాలకృష్ణ, లింగం, శ్రీను, లాయక్‌అలీ, అశోక్‌, మల్లేశ్‌, సాయి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T05:06:41+05:30 IST