వ్యవసాయాధికారి ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2020-09-16T05:54:26+05:30 IST
శామీర్‌పేట మండలంలో వానాకాలంలో రైతులు సాగుచేసిన పంటలను జిల్లా వ్యవసాయాధికారి మేరీరేఖ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

శామీర్‌పేట: శామీర్‌పేట మండలంలో వానాకాలంలో రైతులు సాగుచేసిన పంటలను జిల్లా వ్యవసాయాధికారి మేరీరేఖ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని దేవరయాంజాల్, తూంకుంట, శామీర్‌పేట, పొన్నాల్, బొమ్మరాశిపేట, లాల్‌గడిమలక్‌పేట, యాడారం, తుర్కపల్లి గ్రామాల్లో పర్యటించారు. పంటల వివరాలను సరిగా నమోదు చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏవో రమేష్, ఏఈవో రవి, రైతులు పాల్గొన్నారు.