బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి
ABN , First Publish Date - 2020-02-08T12:02:28+05:30 IST
విద్యార్థులు బాధ్యతయూత పౌరులుగా ఎదిగేందుకు కృషి చే యాలని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో

కొత్తూర్: విద్యార్థులు బాధ్యతయూత పౌరులుగా ఎదిగేందుకు కృషి చే యాలని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్టూడెంట్ పోలీస్ క్యాడెట్(ఎస్‌పీ సీ) విద్యార్థులకు పోలీస్ శాఖపై నిర్వహించిన అవగహన సదస్సుకు ఏసీపీ హాజరై మాట్లాడారు. విద్యార్థుల చెడుదారులను ఎంచుకోకుండా మంచి పౌరులుగా ఎదిగి, సమాజానికి ఆదర్వంగా నిలిచి, దేశానికి సే వలందించాలన్నారు. క్రమశిక్షణ, కృతజ్ఞతభావంతో మెలిగితే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చన్నారు. బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కారక్రమంలో ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు, హెచ్‌ఎం భాగ్యమ్మ, పీడీ విజయసాగర్, ఎస్‌పీసీ ఇన్‌చార్జి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థుల అస్వస్థతపై ఆరా... ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు వి ద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురికావడంపై ఏసీసీ సురేందర్ ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం శుభ్రంగా వండాలని సూచించారు.