ఇంకెవరిని నమ్మాలి

ABN , First Publish Date - 2020-12-18T04:54:55+05:30 IST

ఇంకెవరిని నమ్మాలి

ఇంకెవరిని నమ్మాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

  • సీఎం హామీకే దిక్కూదివానం లేదు 
  • నియామకాలు చేపట్టి ప్రమోషన్లు కల్పించాలి
  • ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్‌
  • కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులు మహాధర్నా 


 మేడ్చల్‌ అర్బన్‌: స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దిక్కుదివానం లేదు.. మరి ఇంకెవర్ని నమ్మాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్‌ విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా కలెక్టరేట్‌ వద్ద జాక్టో, యూఎ్‌సపీసీ అధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు విలువలేకుండా పోయిందని, సీఎం కేసీఆర్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అలాగే ప్రమోషన్లు కల్పించి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలుపరిచేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా బదిలీలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 29న హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించే మహాధర్నాలో వేలాదిగా ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు భుజంగరావు, చంద్రమోహన్‌, కిష్టారెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, బ్రహ్మచారి, మల్లేశప్ప, జాక్టో, యూఎ్‌సపీసీ నాయకులు పాండురంగారెడ్డి, జయసింహరెడ్డి, బాలరాజు, రాఘవేందర్‌, రమేష్‌, రాజు, శ్రీనివాసరావు, శిరీష, నీరజ, వందన, బాలజ్యోతి, అనురాధ, మహేందర్‌, రఘు, రహుఫ్‌, మల్లిఖార్జున్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T04:54:55+05:30 IST