వీధివ్యాపారులు ఆర్థిక ప్రగతి సాధించాలి

ABN , First Publish Date - 2020-11-07T09:28:40+05:30 IST

వీధి వ్యాపారులు ఆర్థిక ప్రగతి సాధించాలని పరిగి మునిసిపల్‌చైర్మన్‌ అశోక్‌ అన్నారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ లావాదేవిలపై అవగాహన సదస్సు నిర్వహించారు

వీధివ్యాపారులు ఆర్థిక ప్రగతి సాధించాలి

పరిగి: వీధి వ్యాపారులు ఆర్థిక ప్రగతి సాధించాలని పరిగి మునిసిపల్‌చైర్మన్‌ అశోక్‌ అన్నారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ లావాదేవిలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలన్నారు. కరోనా పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించి, భౌతికదూరాన్ని పాటించాలన్నారు. వీధి వ్యాపారులకు ఏలాంటి సమస్యలు వచ్చినా అండగా ఉండి సేవలందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా మేనేజర్‌ వెంకటేశ్‌, కౌన్సిలర్లు, పాల్గొన్నారు. అనంతరం వీధి వ్యాపారులకు బీపీ, షుగర్‌  తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2020-11-07T09:28:40+05:30 IST