ఉదన్‌రావుపల్లిలో బాల్యవివాహం నిలిపివేత

ABN , First Publish Date - 2020-11-21T05:42:03+05:30 IST

ఉదన్‌రావుపల్లిలో బాల్యవివాహం నిలిపివేత

ఉదన్‌రావుపల్లిలో బాల్యవివాహం నిలిపివేత

దోమ: మండల పరిధిలోని ఉదన్‌రావుపల్లి గ్రామం లో శుక్రవారం అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన పుచ్చకుంట నర్సింహులు కుమారుడు మల్లేశ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో వివాహం జరుగుతుందని సమాచారం తెలుసుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఎలా ంటి వివాహ కార్యక్రమాలు కనిపించకపోవడంతో పెళ్లి కుమారుడు తండ్రి నర్సింహులుతో ఒప్పంద పత్రాన్ని రాయించుకొని అధికారులు వెళ్లిపోయారు. బాల్య వివాహం జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


Read more