మద్యం అమ్మకాలను నిలిపివేయాలి
ABN , First Publish Date - 2020-05-09T09:31:49+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర
మేడ్చల్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర విమర్శించారు. స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో శుక్రవారం మద్యం అమ్మకాలను నిరసిస్తూ ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీ్‌పరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు రాజేష్, సచిన్, రాము, మహేందర్ పాల్గొన్నారు.