చదువుతోనే అసమానతలు దూరం

ABN , First Publish Date - 2020-12-28T05:48:31+05:30 IST

చదువుతోనే అసమానతలు దూరం

చదువుతోనే అసమానతలు దూరం
అంబేద్కర్‌ విగ్రహాన్ని అవిష్కరిస్తున్న మంత్రి మల్లారెడ్డి, ప్రజాకవి గద్దర్‌

కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

ఎదులాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

ఘట్‌కేసర్‌ రూరల్‌: చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగుతాయని, ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌ సమీపంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ  బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రతిఒక్కరూ తమ హక్కులను, విధులను గౌరవించాలన్నారు. అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు అమలైనప్పుడే సమాజం బాగుపడుతుందని అంబేద్కర్‌ ఆనాడే అభిప్రాయపడ్డారన్నారు. ఆయన చలువతోనే నేడు ప్రతిఒక్కరూ రాజకీయ, ఉద్యోగ, విద్య వంటి రంగాల్లో అవకాశాలు పొందుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఆయన ఆశయసాఽధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ప్రజాకవి గద్దర్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ కాలేరు సురేష్‌, అంబేద్కర్‌ విగ్రహదాత 


గాయరు విశ్వనాథం, ఎంపీటీసీ గట్టగల్ల రవి, ఉపసర్పంచ్‌ లింగేశ్వర్‌రావు, ఎదుగని కృష్ణమూర్తి, బట్టెశంకర్‌, నాగరాజు, కాలేరు రామోజీ, అంబ్కేర్‌ సంఘం నాయకులు సురేష్‌, దుర్గయ్య, బద్దం శంకర్‌, మల్లేష్‌, ముత్యాలు, శ్రీనివాస్‌, మహేష్‌, మురళి, గణేష్‌, గుమ్మడి నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 


స్వామివారిని దర్శించుకున్న మంత్రి

 ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌ శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి ఆలయంలో ఆదివారం మంత్రి చామకూర మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆచార్యులు మంత్రికి అర్చనలు చేసి శాలువాతో సత్కరించి పూలదండను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచు కాలేరు సురేష్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  కాగా ఆలయంలో ధనుర్మాస పూజాకార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.

Updated Date - 2020-12-28T05:48:31+05:30 IST