కొడంగల్‌లో రాఘవేంద్ర స్వామికి విశేషపూజలు

ABN , First Publish Date - 2020-07-08T10:54:49+05:30 IST

కొడంగల్‌ పట్టణంలోని శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు.

కొడంగల్‌లో రాఘవేంద్ర స్వామికి విశేషపూజలు

కొడంగల్‌: కొడంగల్‌ పట్టణంలోని శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వెలిసి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అక్కి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సత్యప్రమోద తీర్థుల వారి చేత 1995 ఆగస్టు 7న స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు తెలిపారు. స్వామివారికి మూలస్థానమైన మంత్రాలయం తరహాలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-08T10:54:49+05:30 IST