హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-07T04:25:46+05:30 IST

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి : ఎస్పీ

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి : ఎస్పీ

వికారాబాద్‌ : హోంగార్డులు నిర్వహిస్తున్న సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ ఎం.నారాయణ అన్నారు. ఆదివారం 58వ జాతీయ హోంగార్డు దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌ జిల్లా హోం గార్డు అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, బాధితులకు న్యాయం అందిస్తూ పేదల పక్షాన నిలబ డి పోలీస్‌ శాఖ గౌరవాన్ని నిలబెట్టడంలో హోంగార్డుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. జిల్లా ప్రజల్లో పోలీ్‌సశాఖ పట్ల మరింత నమ్మకాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించారు. పోలీస్‌ శాఖలో హోంగార్డుల వ్యవస్థకు ప్ర త్యేకమైన గుర్తింపుందని, అందుకు అనుగుణంగా సమర్థవంతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

బొంరాస్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో తనిఖీ

బొంరాస్‌పేట్‌: పౌరులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం బొంరా్‌సపేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. పోలీసు శాఖ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై శ్రీశైలం, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read more