-
-
Home » Telangana » Rangareddy » social service is must
-
సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
ABN , First Publish Date - 2020-12-29T04:50:35+05:30 IST
సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

కందుకూరు: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి పేర్కొన్నారు. సృజనా ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కందుకూరుకు చెందిన బి.ఆంజనేయులుకు 2020సంవత్సరానికి ‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆయన చేతులమీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు పలుసంఘాల్లో పనిచేస్తూ గ్రామీణులకు సేవా కార్యక్రమాలను చేపట్టడంతో ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జడ్జి బూర్గుల మధుసూదన్, నిర్వాహకులు సీహెచ్.రాజశేఖర్‌రెడ్డి, బ్రహ్మయ్యచారి, పద్మారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.