కాశీంపూర్‌ పాఠశాలలో పాము కలకలం

ABN , First Publish Date - 2020-12-29T04:23:47+05:30 IST

కాశీంపూర్‌ పాఠశాలలో పాము కలకలం

కాశీంపూర్‌ పాఠశాలలో పాము కలకలం

బషీరాబాద్‌:  విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు మహిళా ఉపాధ్యా యులు సోమవారం ఉదయం 10 గంటలకు మండల పరిధిలోని కాశీం పూర్‌ పాఠశాలకు చేరుకున్నారు.  ప్రధానోపాధ్యాయుడి గది తెరుస్తుండగా అటువైపు నుంచి ఓ పాము వచ్చింది. దానిని గమనించిన ఉపాధ్యాయులు అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న  గ్రామ సర్పంచ్‌ సి.వెంకటయ్య పాఠశాల వద్దకు చేరుకొని పాము విష యమై టీచర్లను ఆరా తీశారు.

Read more