-
-
Home » Telangana » Rangareddy » smuggled gold in airport
-
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-20T04:57:42+05:30 IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న

శంషాబాద్‌రూరల్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 375 గ్రాముల బంగారాన్ని శనివారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హర్యానాకు చెందిన పునిత్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా-ఏఐ952 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అధికారులు తనిఖీ చేయగా క్యాష్ కౌంటింగ్ చేసే మిషిన్‌లో 375 గ్రాముల బంగారం లభ్యమైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.