-
-
Home » Telangana » Rangareddy » shooting
-
రెండోరోజూ కొనసాగిన సినిమా షూటింగ్
ABN , First Publish Date - 2020-12-07T04:27:28+05:30 IST
రెండోరోజూ కొనసాగిన సినిమా షూటింగ్

బషీరాబాద్: బషీరాబాద్ మండలం మంతన్‌గౌడ్ తండాలో డీఎస్‌ఆర్ ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ రెండోరోజైన ఆదివారం కూడా కొన సాగింది. ఈ సందర్భంగా నటీనటులు గౌతం రాజు, జయనాయుడుతో ఓ పురాతన రాతి ఇంట్లో పలు సన్నివేశాలను దర్శకుడు డీఎస్ రాథోడ్ చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్ మరో ఆరురోజుల పాటు బషీరాబాద్‌లో కొనసాగుతుందని, అనంతరం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరిస్తామని చిత్రం బృందం తెలిపింది. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ డీఎస్ రాథోడ్, మాటలు నరేంద్ర జీకుమార్, కెమెరామెన్ పీఎస్ కర్ణ, సంగీతం మనీష్, కో డైరెక్టర్‌గా కేశవ్‌గోనా, కొరియో గ్రాఫర్ హరిమాస్టర్, పీఆర్‌వోగా వాసు పనిచేస్తున్నారు.