శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెరిగిన..దేశీయ విమానాల రాకపోకలు
ABN , First Publish Date - 2020-06-18T10:12:19+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా శంషా బాద్ అంతర్జాతీయ విమానా శ్రయంలో సుదీర్ఘంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీ సులు రద్దయ్యాయి.
శంషాబాద్‌రూరల్ : లాక్‌డౌన్ కారణంగా శంషా బాద్ అంతర్జాతీయ విమానా శ్రయంలో సుదీర్ఘంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీ సులు రద్దయ్యాయి. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదే శాల మేరకు గతనెల 25న దేశీయ విమానాల రాకపో కలు పునరుద్ధరించారు. మొ దట్లో దేశీయ విమానాల రాక పోకలు తగ్గగా, రెండు రోజు లుగా భారీగా పెరిగాయి.
బుధవారం ఒక్కరోజే వివిధ రాష్ట్రాల నుంచి 57 విమా నాలు(అరైవల్) అందులో 4,509మంది ప్రయాణికులు శంషాబాద్ విమానా శ్రయా నికి వచ్చారు. అలాగే శంషాబాద్ ఎయుర్‌పోర్టు నుంచి (డిపార్చర్) వివిధ రాష్ట్రాలకు 57 విమానాల్లో 4,778 మంది ప్రయాణికులు వెళ్లారు. మే 25వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు అరైవల్ 88,177, డిపార్చర్ 9707 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1,029 విమానాలు వివిధ రాష్ట్రాలకు వెళ్లగా వివిధ రాష్ట్రాల నుంచి 1,031 విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాయి.