-
-
Home » Telangana » Rangareddy » Shadnager Muncipal chairman
-
షాద్‌నగర్‌లో పచ్చదనాన్ని పరిరక్షిద్దాం
ABN , First Publish Date - 2020-12-20T04:47:42+05:30 IST
షాద్‌నగర్‌లో పచ్చదనాన్ని పరిరక్షిద్దాం

వైద్యులు, వ్యాపారులకు చైర్మన్ నరేందర్ పిలుపు
షాద్‌నగర్‌అర్బన్: షాద్‌నగర్ పట్టణంలో పచ్చదనాన్ని పెంచి, పారిశుధ్యాన్ని కాపాడటానికి వైద్యులు, వ్యాపారులు ముందుకు రావాలని మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్ పిలుపునిచ్చారు. స్థానిక జనని చిన్నపిల్లల ఆసుపత్రి ఎండీ డాక్టర్ చందులాల్ రాథోడ్, మున్సిపాలిటీ సంయుక్తాధ్వర్యంలో శనివారం షాద్‌నగర్ పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి హాజరైన నరేందర్ మాట్లాడుతూ పట్టణంలోని ఆసుపత్రుల యాజమాన్యాలతో పాటు పట్టణ వ్యాపారులు ముందుకొచ్చి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కానుగు అంతయ్య, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, సాయిబాబా తదిత రులు పాల్గొన్నారు.