అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు

ABN , First Publish Date - 2020-10-03T09:33:41+05:30 IST

మండలంలోని గౌడవెల్లి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్‌ ..

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు

మేడ్చల్‌: మండలంలోని గౌడవెల్లి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్‌ సురేందర్‌ముదిరాజ్‌ అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ ఉత్తర్వులను కార్యదర్శి, తాను బేఖాతబేఖాతర్‌ చేశారనేది అవాస్తమన్నారు. తమకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ సభ తీర్మాణం మేరకే డంపింగ్‌యార్డు పనులు చేపట్టామన్నారు. సమావేశంలో రాజకుమారి, శివకుమార్‌, ఉమారాణి,రాజ్యలక్ష్మీ, గోపాల్‌ పాల్గొన్నారు. 


సర్పంచ్‌, కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు 

 గౌడవెల్లి సర్పంచ్‌, కార్యదర్శిలపై శుక్రవారం ఉపసర్పంచ్‌ పెంటమ్మతో పాటు పలువురు వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జూన్‌ 23న కలెక్టర్‌ ఉత్తర్వులు వచ్చినప్పటికీ పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించి డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు చేపట్టారని వారు తెలిపారు. 

Updated Date - 2020-10-03T09:33:41+05:30 IST