సాగర్‌ సాగునీటి షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2020-08-11T09:17:38+05:30 IST

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు సా గునీటి షెడ్యూల్‌ను ఎట్టకేలకు విడుదల చేశారు.

సాగర్‌ సాగునీటి షెడ్యూల్‌ విడుదల

ఎడమ కాల్వకు నవంబరు 28 వరకు నీరు


మిర్యాలగూడ, ఆగస్టు 10:  నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు సా గునీటి షెడ్యూల్‌ను ఎట్టకేలకు విడుదల చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో వానాకాలం పంటలకు నవంబర్‌ 28 వరకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఎన్నెస్పీ ఓఅండ్‌ఎం ఎస్‌ఈ విజయభాస్కర్‌ సోమవారం తెలిపారు. వారబందీ విధానంలో మొత్తం ఏడు విడతల్లో నీటిని విడుదల చేస్తామని చెప్పారు. మొత్తంగా 78 రోజుల పాటు ఒకటో, రెండో జోన్‌కు 50టీఎంసీల నీటిని విడుదల చేస్తున్న ట్లు తెలిపారు. రైతులు నీటి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు.


సాగర్‌ నీటి విడుదల ఇలా...విడతలు నుంచి వరకు రోజులు

మొదటి విడత ఈ నెల 7 ప్రారంభమైంది 30.08.2020 24 రోజులు


రెండో విడత   6.09.2020 14.09.2020 9 రోజులు

మూడో విడత  21.09.2020 29.09.2020       9 రోజులు

నాలుగో విడత 6.10.2020 14.10.2020 9  రోజులు

ఐదో విడత   21.10.2020 29.10.2020 9 రోజులు

ఆరో విడత   5.11.2020 13.11.2020 9 రోజులు

ఏడో విడత   20.11.2020 28.11.2020 9 రోజులు

Updated Date - 2020-08-11T09:17:38+05:30 IST