సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-08T04:58:37+05:30 IST

సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి



వికారాబాద్‌ ,(ఆంధ్రజ్యోతి) :  2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల ద్వారా సబ్సిడీ రుణాల కోసం స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కేటగిరిల కింద దరఖాస్తు చేసుకుని మంజూరు కాని దరఖాస్తుదారులు తిరిగి ఈనెల 10వ తేదీలోగా అప్‌లోడ్‌ చేయాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాబు మోజెస్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆమోదం పొందడానికి బ్యాంకు, మండల పరిషత్తు, మునిసిపల్‌ కమిషనర్ల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ లాగిన్‌లకు అప్‌లోడ్‌ చేయాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో మండలాలు, మునిసిపాలిటీల్లో ఎంపిక చేసిన దరఖాస్తుల వివరాలను కూడా తొలగించనున్నట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2020-12-08T04:58:37+05:30 IST