కీసరగుట్టలో భక్తిశ్రద్ధలతో రుద్రహోమం

ABN , First Publish Date - 2020-12-14T05:21:47+05:30 IST

కీసరగుట్టలో భక్తిశ్రద్ధలతో రుద్రహోమం

కీసరగుట్టలో భక్తిశ్రద్ధలతో రుద్రహోమం
కీసరగుట్టలో రుద్రహోమం నిర్వహిస్తున్న దృశ్యం

కీసర: కీసరగుట్టలో శ్రీ రామలింగేఽశ్వర స్వామి ఆలయంలో రుద్రహోమాన్ని కనుల పండువగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయచైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌ శర్మ అధ్వర్యంలో గర్భాలయంలోని మూల విరాట్‌కు శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం ఆలయ యాగశాలలో అర్చకులు రుద్రహోమం జరిపించారు. కార్యక్రమంలో ఈవో సుధాకర్‌రెడ్డి, అర్చకులు బలరాంశర్మ, రవి శర్మ,  రవి మోత్కురు, రమేష్‌, వీరేష్‌, సాయి శర్మ పాల్గొన్నారు. 


శివపార్వతుల కల్యాణోత్సవం


శామీర్‌పేట: తూంకుంట మున్సిపాలిటీలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. గడీలభవాణీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మున్సిపాలిటీ 7వవార్డు కౌన్సిలర్‌ నాగే్‌షలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని పండిత వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరయాంజాల్‌ మాజీ ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి,  నాయకులు, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. 


భక్తిశ్రద్ధలతో మాస శివరాత్రి పూజలు


శామీర్‌పేట: మాస శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ఆదివారం శివాలయంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మండల కేంద్రం శామీర్‌పేటలోని శ్రీభవానిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మురళీధరశర్మ ఆధ్వర్యంలో భక్తులు రుద్రాభిషేకం, గోత్రనామాలతో అర్చన చేసి మంత్ర పుష్పం, తీర్థప్రసాదాల వితరణ చేశారు. 


ఎదులాబాద్‌లో మహారుద్రాభిషేకం


ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని ఎదులాబాద్‌లోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఎదులాబాద్‌ పంచాయతీ వార్డుసభ్యురాలు సామల భవానిఅమర్‌ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివలింగానికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. కార్తీకమాసం నేటితో ముగియనుండటంతో ఒక్కరోజు ముందు శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల అరిష్టాలు తొలగుతాయని వేదపండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరాజు,  వెంకటేష్‌, నవీన్‌, రఘు, రంజిత్‌, శివకుమార్‌, వెంకటేష్‌, అభిషేక్‌, నితిన్‌, చరణ్‌, బాలమణి, సరిత, నాగమణి, మంగ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-14T05:21:47+05:30 IST