-
-
Home » Telangana » Rangareddy » RTC Bus accident in road
-
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-16T05:13:24+05:30 IST
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీ్‌సస్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి దూసుకుపోయింది. ఈ బస్సుకు తృటి లో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఎంజీబీఎస్ బస్టాండు నుంచి షాద్‌నగర్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు మార్గమధ్యంలోని గగన్‌పహాడ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం.