త్వరలో జిల్లాకు రూ.100 కోట్లు

ABN , First Publish Date - 2020-10-24T10:31:18+05:30 IST

జిల్లాలోని పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి త్వరలో రూ.100కోట్లు నిధులు రానున్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి వెల్లడించారు.

త్వరలో జిల్లాకు రూ.100 కోట్లు

వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి


తాండూరు రూరల్‌ : జిల్లాలోని పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి త్వరలో రూ.100కోట్లు నిధులు రానున్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి వెల్లడించారు. తాండూరు మండలం కొత్లాపూర్‌, సంగెంకలాన్‌, మల్కాపూర్‌, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్‌, బిజ్వార్‌ గ్రామాల్లో రూ.70 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు తాండూరు ఎంపీపీ ఎస్‌.అనితారవీందర్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో పశుగణనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గాజీపూర్‌ నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు రవీందర్‌గౌడ్‌, గౌడి మంజుల, శ్రీనివా్‌సరెడ్డి, స్వరూప, కృష్ణ, ఎస్‌.రవీందర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌, విజయలక్ష్మి, నరేందర్‌రెడ్డి, మేఘానాథ్‌గౌడ్‌, రవి సింధే, సిరిగిరిపేట్‌ పండరి, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మల్కాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగప్ప, ఉపాధ్యాయులు చైర్‌పర్సన్‌ను సన్మానించారు. పాఠశాల ఆవరణలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి చైర్‌పర్సన్‌ బతుకమ్మ ఆడారు. 


జడ్పీ కార్యాలయంలో వాహన పూజ

వికారాబాద్‌ : దసరా పర్వదినాన్ని పురష్కరించుకొని శుక్రవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన వాహనపూజ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ వాహనాలన్నింటికీ వాహన పూజ నిర్వహించారు. అనంతరం పట్టణంలో కోటాలగూడ మాజీ సర్పంచ రాఘవన్‌ గృహప్రవేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగం, ముత్తహార్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T10:31:18+05:30 IST