పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2020-11-19T09:08:53+05:30 IST

వరద సాయం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించడంతో బుధవారం గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మున్సిపాలిటీలు, కీసర మండలాల్లో మీ సేవా కేంద్రాలకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు.

పోటెత్తిన జనం

 వరద సాయం కోసం దరఖాస్తుల వెల్లువ 


 మీసేవా కేంద్రాల వద్ద కిక్కిరిసిమేడ్చల్‌/కీసర: వరద సాయం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించడంతో బుధవారం గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మున్సిపాలిటీలు, కీసర మండలాల్లో మీ సేవా కేంద్రాలకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. ఇంతకుముందు వరకు నగరానికే పరిమితమైన జనం తాకిడి బుధవారం అనూహ్యంగా నగరశివారు ప్రాంతమైన మేడ్చల్‌కు పాకింది. మీ సేవా కేంద్రాల వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. వరద సాయం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు పత్రాలతో క్యూలో నిలబడ్డారు. వరద బాధితులు ఉదయం ఆరు గంటల నుంచే మీ సేవా, ఈసేవా కేంద్రాల వద్ద బారులు తీరారు.


ఒక్కసారిగా ప్రజలు ఎగబడటంతో సర్వర్లు కూడా పనిచేయలేదు. మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలతో క్యూలో ఇబ్బందులుపడ్డారు. కీసరలోని మీ- సేవా వద్ద జనాలు దరఖాస్తులతో పెద్ద ఎత్తున్న క్యూలో నిల్చున్నారు.  నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్‌ ప్రాంతాలకు జనాలు పెద్ద ఎత్తున ఉదయమే మీ-సేవా కేంద్రం వద్దకు చేరుకొని వరద సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రోడ్డుపైకి జనాలు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.  కాగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపఽథ్యంలో వరద సాయాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-19T09:08:53+05:30 IST