మాతా శిశు మరణాలను నివారించాలి

ABN , First Publish Date - 2020-11-13T09:39:03+05:30 IST

మాతాశిశు మరణాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌ సూచించారు.

మాతా శిశు మరణాలను నివారించాలి

షాద్‌నగర్‌ రూరల్‌: మాతాశిశు మరణాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌ సూచించారు. ఫరూఖ్‌నగర్‌ మం డలం చించోడు ప్రాథమిక ఆరోగ్య కేద్రంలో గురువారం వైద్య సిబ్బందికి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు రిజిస్ట్రేషన్‌ వీలైనంత త్వరగా నమోదు చేయించుకునే విధంగా చూడాలని తెలిపారు. ప్రసవం ఇబ్బంది గా ఉన్నట్లు గుర్తిస్తే అటువంటి వారిని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించే విధ ంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తద్వారా మాతా శిశు మరణాలను నివారిం చవచ్చ న్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సాయిలక్ష్మి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T09:39:03+05:30 IST