ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-11-13T09:37:03+05:30 IST
ఆదిభట్ల టాటా అడ్వాన్స్‌డ్ సిస్టంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం: ఆదిభట్ల టాటా అడ్వాన్స్‌డ్ సిస్టంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు. గురువారం ఇబ్రహీంపట్నం తహసీల్దారు వెంకటేశ్వర్లుకు యూనియన్ ఆధ్వర్యంలో కంపెనీ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. సిబ్బంది పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు యాజమాన్యమే భరించాలన్నారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని ఇప్పటికే 55 మందిని టర్మినేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ సీహెచ్.బుగ్గరాములు, యాదగిరి, వెంకటే్‌షబాబు, కండప్ప, సదానంద్, పుష్పేందర్ తదితరులు పాల్గొన్నారు.