టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు

ABN , First Publish Date - 2020-11-13T09:32:51+05:30 IST

వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సమక్షంలో గురువారం బంట్వారం కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు

బంట్వారం: వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సమక్షంలో గురువారం బంట్వారం కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు  టీఆర్‌ఎస్‌  పార్టీలో  చేరారు. సర్పంచ్‌ లావణ్యతో పాటు కాంగ్రెస్‌ నాయకులు పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎ్‌సలో చేరారు. వీరికి ఎమ్మెల్యే ఆనంద్‌   టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బంట్వారం ఎంపీటీసీ పద్మ, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎఎంసీ చైర్మెన్‌ మల్లేశం, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ ఖాజాపాశ, నాయకులు బల్వంత్‌రెడ్డి, రాములుయాదవ్‌, శివకుమార్‌, శరణారెడ్డి, శ్రీనివాస్‌, నర్సింహరెడ్డి, మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T09:32:51+05:30 IST