ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

ABN , First Publish Date - 2020-03-13T10:11:25+05:30 IST

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌: విద్యతోనే బంగారు తెలంగాణ సాధ్యమని  ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కడ్తాల్‌ మండల కేంద్రంలో రూ.3.35 కోట్లతో నిర్మించే కస్తూర్బా బాలికల పాఠశాల భవన నిర్మాణానికి జడ్పీటీసీ  దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీ మోత్యనాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సర్పంచ్‌ గూడురు లక్ష్మీనర్సింహా రెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పంచాయతీ పారిశుధ్య కార్యక్రమాల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను, రూ.15లక్షలతో నిర్మించే సీసీరోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం ఉన్నా రాష్ర్టాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథాకలు సాగేలా బడ్జెట్‌ రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహేందర్‌ రెడ్డి, ఎంఈవో రామేశ్వర్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్లు వీరయ్య, అర్జున్‌రావు, ఉపసర్పంచ్‌ రామకృష్ణ, ఎంపీటీసీలు పాలకుర్ల రాములు, బొప్పిడి గోపాల్‌, ఉమావతి బుగ్గయ్య గౌడ్‌, ప్రియ రమేష్‌ నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు  శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు లాయక్‌అలీ, మోత్య నాయక్‌, భిక్షపతి, హంస, లక్పతినాయక్‌, జాహంగీర్‌ అలీ, శ్రీనివాస్‌, బిక్యనాయక్‌, భీమన్‌నాయక్‌, రాంచంద్రయ్య, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T10:11:25+05:30 IST