కీసరలో ఇన్‌చార్జి డీపీవో విచారణ

ABN , First Publish Date - 2020-03-13T10:11:02+05:30 IST

కీసరలో ఇన్‌చార్జి డీపీవో విచారణ

కీసరలో ఇన్‌చార్జి డీపీవో విచారణ

కీసర : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన ప్రణాళిక పథకంలో భాగంగా నిధుల దుర్వినియోగం, హరితహారం  కార్యక్రమంలో నాటిన మొక్కల వివరాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కీసర గ్రామపంచాయతీ పరిధిలో గురువారం అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కీసర గ్రామంలో మన ఊరు- మన ప్రణాళికలో భాగంగా చేసిన పనుల కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేశారని గ్రామస్థులు జిల్లా ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్‌చార్జి డీపీవో స్మిత గురువారం  విచారణ జరిపారు. 30 రోజుల పాటు గ్రామంలో చేసిన పనులు, చెల్లించిన బిల్లులు, రశీదులను ఆమె పరిశీలించారు. అదే విధంగా 2019-20 సంవత్సరంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల వివరాలపై కూడా విచారణ జరిపారు. గ్రామపంచాయతీ పాలకులు, అధికారులు చెప్పిన మొక్కల వివరాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న మొక్కల లెక్కలకు ఏమాత్రం పొంతన లేదని ఫిర్యాదుదారులు అధికారులకు తెలిపారు. ఈ మేరకు మొక్కలు నాటిన ప్రదేశాలకు వెళ్లి స్వయంగా మొక్కలను తనిఖీ చేశారు. విచారణలో భాగంగా సమగ్ర నివేదికను సిద్దం చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఎల్‌పీవో స్మిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశిరేఖ, ఎంపీవో మంగతాయరు, సర్పంచ్‌ నాయకపు మాధురి, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T10:11:02+05:30 IST