-
-
Home » Telangana » Rangareddy » rr
-
991 మంది విద్యార్థుల గైర్హాజరు
ABN , First Publish Date - 2020-03-13T10:10:19+05:30 IST
991 మంది విద్యార్థుల గైర్హాజరు

కొనసాగుతోన్న ఇంటర్ పరీక్షలు
53,777 మందికి 52,786 మంది హాజరు
కూకట్‌పల్లి పరిధిలో అత్యధిక మంది విద్యార్థుల గైర్హాజరు
మేడ్చల్ అర్బన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. గణితం పేపర్- 1బీ, జూవాలజీ పేపర్- 1, హిస్టరీ పేపర్- 1 పరీక్షలను నిర్వహించారు. 53,777 మంది విద్యార్థులకు 52,786 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 991 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 52,786 మంది విద్యార్థులు హాజరుకాగా, 991 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అల్వాల్ మండలంలోని 7 పరీక్ష కేంద్రాల్లో 2,414 మందికి 50 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదు. బాచుపల్లిలో 18 కేంద్రాల్లో 11,351 మందికి133 మంది గైర్హాజరయ్యారు. బాలానగర్‌లోని 2 కేంద్రాల్లో 1,115 మందికి ఐదుగురు గైర్హాజరయ్యారు. దుండిగల్ గండిమైసమ్మలోని 3 కేంద్రాల్లో 1,128 మందికి 16 మంది, ఘట్‌కేసర్‌లోని 5 కేంద్రాల్లో 1,568 మందికి 25 మంది, కాప్రాలోని 12 కేంద్రాల్లో 4,093 మందికి 109 మంది గైర్హాజరయ్యారు. కీసరలోని 3 కేంద్రాల్లో 497 మందికి 32 మంది, కూకట్‌పల్లిలోని 28 కేంద్రాల్లో 16,157 మందికి 232 మంది గైర్హాజరయ్యారు. మల్కాజిగిరిలోని 3 కేంద్రాల్లో 461 మందికి 11 మంది, మేడ్చల్‌లోని 5 కేంద్రాల్లో 1,585 మందికి 99 మంది, మేడిపల్లిలోని 9 కేంద్రాల్లో 3,247 మందికి 45 మంది గైర్హాజరయ్యారు. కుత్బుల్లాపూర్‌లోని 11 కేంద్రాల్లో 4,470 మందికి 129 మంది, శామీర్‌పేటలోని 3 కేంద్రాల్లో 682 మందికి 28 మంది, ఉప్పల్‌లోని 13 కేంద్రాల్లో 5,009 మందికి 77 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.