నడిరోడ్డుపై టాటాఏస్‌ బోల్తా

ABN , First Publish Date - 2020-03-13T10:09:27+05:30 IST

నడిరోడ్డుపై టాటాఏస్‌ బోల్తా

నడిరోడ్డుపై టాటాఏస్‌ బోల్తా

ఎంసీ పల్లి మండలం పోతారం సమీపంలో ఘటన

కూరగాయల లోడ్‌తో వెళ్తుండగా ప్రమాదం

12 మందికి తీవ్రగాయాలు ఫ కూరగాయలు చిందరవందర


శామీర్‌పేట రూరల్‌ : కూరగాయల లోడ్‌తో వెళ్తున్న టాటాఏస్‌ బోల్తా పడటంతో 12 మందికి తీవ్ర గాయలైన సంఘటన మూడుచింతలపల్లి మండలం పోతారం చౌరస్తా సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మాపూర్‌ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన లక్ష్మాపూర్‌తండా నుంచి పలువురు రైతులు టాటా ఏస్‌ వాహనం (టీఎ్‌స30టీ4038)లో ఓవర్‌ లోడ్‌తో కూరగాయలు నింపుకుని అల్వాల్‌లోని రైతుబజార్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పోతారం చౌరస్తా సమీపంలోకి రాగానే ఓవర్‌ లోడ్‌తో వస్తున్న కూరగాయల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కూరగాయలతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న శోభ, లలిత, నీలమ్మ, లక్ష్మణ్‌, బుజ్జి, యాదగిరి, బుజ్జి, తాత్కలిక డ్రైవర్‌ ప్రవీణ్‌తో పాటు మిగతా వారు రోడ్డుపై పడిపోయారు. దీంతో వీరందరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-03-13T10:09:27+05:30 IST