-
-
Home » Telangana » Rangareddy » rr
-
విద్యార్థిపైకి పలక విసిరిన టీచర్
ABN , First Publish Date - 2020-03-13T10:07:44+05:30 IST
విద్యార్థిపైకి పలక విసిరిన టీచర్

బాలుడి తలకు తీవ్రగాయం
శంషాబాద్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన
శంషాబాద్ : టీచర్ విద్యార్థిపై కోపంతో పలక విసిరడంతో తలకు తీవ్ర గాయమైన సంఘటన శం షాబాద్ మున్సిపల్ కేం ద్రంలోని హుడాకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సం ఘటన గురువారం వెలు గులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన శివరాజ్, అశ్విని దంపతులు కొంత కాలం క్రితం బతుకుదెరువు కోసం హుడాకాలనీకి వచ్చి కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు విజయ్(4)ను కాలనీలోని అంగన్‌వాడీ పాఠశాలలో చేర్చారు. అయితే బుధవారం టీచర్ పద్మ ఏదో కోపంతో విద్యార్థిపైకి పలక విసరడంతో విద్యార్థి తలకు తగిలి రక్తస్రావమైంది. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తల్లిదండ్రులను కోరింది. బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గాయం తీవ్రంగా ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
టీచర్ పద్మ వివరణ
టీచర్ పద్మను వివరణ కోరగా.. విద్యార్థి చెడ్డి విప్పి అసభ్యంగా ప్రవర్తిం చాడని, దీంతో పలక విసిరితే తల పగిలిందన్నారు. ఇంత పెద్ద గాయం అవు తుందని అనుకోలేదన్నారు. ఈ సంఘటనపై చింతిస్తున్నాని తెలిపారు.